జీపీఓల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా వీరన్న
అడ్డగూడూరు : గ్రామ పాలన అధికారుల (జీపీఓ) అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన దాసరి వీరన్న ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జీపీఓల సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వీరన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీపీఓల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీరన్న పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించండి
భువనగిరిటౌన్ : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) వెంకటరమణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఏ–గ్రేడ్ క్వింటా రూ.2,389, కామన్ రకం రూ.2,369 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని కేంద్రాల్లో ప్రభుత్వ సూచనలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 330 కేంద్రాలను ప్రారంభించి, ప్రతి సెంటర్‌కు ఒక ఏఈఓను నియమించినట్లు వెల్లడించారు.
రికార్డుల నిర్వహణ తప్పనిసరి
కొనుగోలు కేంద్రాల్లో గెస్ట్, ఎనాలసిస్ రికార్డులు తప్పనిసరిగా రాయాలని ఆదేశించారు. వడ్ల కుప్పలపై మళ్లీ వడ్లు పోయరాదని, దీని వల్ల ధాన్యం నిర్దిష్ట తేమ శాతం వచ్చే అవకాశం ఉండదన్నారు. ట్రక్ షీట్, ఎనాలసిస్ షీట్‌ను లారీలతో పాటు మిల్లులకు పంపాలని, ప్రతి బస్తాలో ధాన్యం 40.6 కిలోలు తూకం కచ్చితంగా ఉండేలా ఏఈఓలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
యాదగిరీశుడికిసంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణోత్సవం, అష్టోత్తీరం బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
జీపీఓల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా వీరన్న


