ఆటాపాటలతో ఓనమాలు
భువనగిరి: ప్రీ ప్రైమరీ స్కూళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్‌కు రూ.1.70 లక్షల చొప్పున 35 పాఠశాలలకు రూ.61.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలకు రంగులు, తరగతి గదుల గోడలపై బొమ్మలు వేయడంతో పాటు పిల్లలకు ఆటల సామగ్రి, ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు విద్యార్థులకు యూనిఫాం, షూ, టై అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం
తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు నిండగానే పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడిపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శిశు విద్యను ప్రవేశపెట్టాలని భావించి అక్టోబర్‌లో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించింది. మొదటి విడతగా జిల్లాలో 35 పాఠశాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. వీరికి బోధన చేసేందుకు ప్రతి స్కూల్‌లో ఒక టీచర్, ఒక ఆయాను నియామించారు.
ఫ ప్రీ ప్రైమరీ పాఠశాలల బలోపేతంపై విద్యాశాఖ దృష్టి
ఫ సౌకర్యాల కల్పనకు రూ.60 లక్షలు మంజూరు


