లారీలు రాకపోతే కాంట్రాక్టర్‌దే బాధ్యత
తుర్కపల్లి: కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోతే ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోళ్లలో ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.
లారీలు రావడం లేదని
గంధమల్ల రైతుల ఫిర్యాదు
తుర్కపల్లికి కలెక్టర్ వస్తున్నారని తెలుసుకున్న గంధమల్ల గ్రామ రైతులు.. అక్కడికి వచ్చారు. కొనుగోలు కేంద్రానికి లారీలు సక్రమంగా రావడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మిల్లులకు ధాన్యం ఎగుమతుల్లో జాప్యం జరుగుతుందని, ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని వాపోయారు. కలెక్టర్ స్పందించి తక్షణమే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి కారణం తెలుసుకున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రోజుకు కనీసం మూడు లారీలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి జానయ్య, తహసీల్దార్ జలకుమారి, ఏపీఓ రమణ ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


