ఎంజీయూ ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా హరీష్‌కుమా
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్‌గా హరీష్‌కుమార్‌ను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు 2018 నుంచి డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రశాంతి నుంచి శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంతి నేతృత్వంలో సుమారు 300 కంపెనీలను యూనివర్సిటీకి ఆహ్వానించి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో హరీష్‌కుమార్ ఎంతో కృషి చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. డైరెక్టర్‌గా డా. హరీష్‌కుమార్ ఒక సంవత్సరం పాటు విద్యార్థులకు సేవలందించనున్నారు. అనంతరం ప్రశాంతిని, హారీష్‌కుమార్‌ను విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నీలకంఠం, శేఖర్, సత్యనారాయణరెడ్డి, సమరీన్, కజ్మీ తదితరులు పాల్గొన్నారు.


