అనుమానాస్పద స్థితిలో మృతి
చిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని కాల్వలో పడి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన అంతటి సీనయ్య(39) దివ్యాంగుడు. ఆటో కొనుగోలు చేసి డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు. ఐదు రోజుల క్రితం తన అత్తగారి ఊరైన చండూరు మండలం బంగారుగడ్డకు వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం మునుగోడుకు ఆటో కిరాయి కోసమని వెళ్లాడు. తిరిగి బంగారుగడ్డలోని ఇంటిని చేరుకోలేదు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీనయ్యకు భార్య రజిత ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. శనివారం ఉదయం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన కాల్వలో ఆటోతో పాటు సీనయ్య పడిపోయి మృతి చెంది ఉండడంతో ఈ విషయాన్ని సీనయ్య అన్న నర్సింహ రజితకు ఫోన్ చేసి తెలిపాడు. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మామిడి రవికుమార్ పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


