20 గుంటల్లో 23 రకాల వరి విత్తనాలు
మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి తన వ్యవసాయ భూమిలో సేంద్రియ పద్ధతిలో దేశీయ వరి విత్తనాలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అర్ధశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన గోవర్ధన్ వ్యవసాయంపై మక్కువ. నాలుగేళ్లుగా తనకున్న 3 ఎకరాల విస్తీర్ణంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఈసారి 20 గుంటల విస్తీర్ణంలో 23 రకాల దేశీయ వరి విత్తనాల సాగు చేపట్టాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వకాలం నాటి వరి విత్తనాలు సేకరించాడు. అలా సేకరించిన విత్తనాలను అర ఎకరంలో సాగు చేశాడు. గతంలో నాలుగు రకాల వరి విత్తనాలు సాగు చేయగా.. హైబ్రిడ్ విత్తనాలతో ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి అధిక దిగుబడులు సాధిస్తున్నప్పటికీ ఆరోగ్యానికి హానికరమని భావించి దేశీయ వరి విత్తనాల సాగును ఎంచుకున్నాడు. మార్కెట్‌లో దేశీయ వరి ధాన్యం (బియ్యం) సుమారు క్వింటాల్ రూ.10 వేల వరకు ఉంటుందని పేర్కొంటున్నాడు.
సాగవుతున్న వివిధ రకాల
వరి విత్తనాలు ఇలా..
కులాకార్ (రెడ్‌రైస్), కాలనమ్మక్, రత్నచోడి, కాలబట్టి, కృష్ణవీహీ, నారాయణకామిని, బహురూపి, తులైపంజి, సీరగసాంబ, ఇంద్రాణి, పొక్కుర్, మాపల్లె, ఇల్లపు సాంబ, మట్ట రైస్, తూయమల్లి, కాలజీర, పుంగార్, చిట్టి ముత్యాలు, మణిపూర్ బ్లాక్, చికిల కోయిల, డాక్టర్ రైస్, రాజముడి, కర్పుకవని, గరుడన్‌సాంబ, కరుంగ్‌కరువై లాంటి దేశవాళి వరి విత్తనాలు సాగు చేస్తున్నాడు. ఈ దేశీయ వరి విత్తనాల ద్వారా సాగు చేసిన పంటతో కాల్షియం, పొటాషియం, ఐరన్ లభిస్తుందని పేర్కొంటున్నాడు.
ఫ సేంద్రియ పద్ధతిలో దేశీయ
వరి విత్తనాలు సాగు చేస్తున్న
యువ రైతు
22ఎంటిఆర్ 05 వివిధ రకాల దేశీయ వరి విత్తనాల సాగు
22ఎంటిఆర్ 02 కాలన్ నమ్మక్ వరి
20 గుంటల్లో 23 రకాల వరి విత్తనాలు
20 గుంటల్లో 23 రకాల వరి విత్తనాలు


