ఆలోచనలు
ఆకాశానికి ఎగిరిన
ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూడగానే ఎవరికై నా చూడముచ్చటగా అనిపిస్తుంది. కానీ అది ఎలా ఎగురుతుందో తెలుసుకుని దానిని తయారుచేయాలనే ఆలోచన కొందరికే వస్తుంది.
ఆ కొందరిలో ఒకడు నల్లగొండకు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ షాపెల్లి రవిప్రసాద్‌రావు. ఆయన తన ఇంటినే ఒక ప్రయోగశాలగా మార్చుకుని మినీ ఏరోప్లేన్‌లు, డ్రోన్లు తయారుచేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు.
రవిప్రసాద్‌రావు తయారు చేసిన డ్రోన్
నేను మినీ ఏరోప్లేన్‌లు, డ్రోన్లను డబ్బుల కోసం తయారు చేయడం లేదు. విమానాలు, డ్రోన్లపై నాకున్న ఆసక్తితో ప్రయోగాలు చేస్తూనే అన్ని విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డ్రోన్లకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మినీ ఏరోప్లేన్‌లు, డ్రోన్‌లు తయారుచేస్తే దానికి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రస్తుతం నేను ఏరో మోడలింగ్ క్లస్టర్, వరల్డ్ డ్రోన్ బిల్డర్స్‌లో సభ్యుడిగా ఉన్నాను. –షాపెల్లి రవిప్రసాద్‌రావు
ఆలోచనలు
ఆలోచనలు
ఆలోచనలు


