రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : క్రీడలు జిల్లాలు, రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి దోహదపడతాయని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాపోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వాలీబాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మాజీ వాలీబాల్ జాతీయ క్రీడాకారులు యడవల్లి ప్రవీణ్‌కుమార్, వాలీబాల్ ఫౌండేషన్ సభ్యులు రవికుమార్, ఆదినారాయణ, మమత, వెంకటేశ్వర్లు, కిరణ్ పాల్గొన్నారు.
25న వాలీబాల్ ఎంపిక పోటీలు
సూర్యాపేట : తెలంగాణ జూనియర్ అంతర్ జిల్లాల 8వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు ఈ నెల 25న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి ప్రకాష్ శనివారం తెలిపారు. 2008 జనవరి 1 తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు చక్రహరి నాగరాజు 98486 20226, గడ్డం వెంకటేశ్వర్లు 94944 44870, మన్నెం సీతారాంరెడ్డి 93930 44274 నంబర్లను సంప్రదించాలని కోరారు.


