
పొగచూరిన కోతి!
ఫ టైర్ల రీసైక్లింగ్ కంపెనీల పొగతో నల్లగా మారిన వానరం
మోటకొండూర్: మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద టైర్ల రీసైక్లింగ్‌కు సంబంధించి రెండు కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక కంపెనీ ఆరు నెలల క్రితం, మరో కంపెనీ రెండు నెలల క్రితం ఉత్పత్తులను ప్రారంభించింది. ఈ కంపెనీ ల నుంచి వస్తున్న పొగ, నల్లటి ధూళి వల్ల పంట చేలు నల్లబారుతున్నాయి. అంతేకాకుండా అక్కడ సంచరిస్తున్న కోతులు సైతం నలుపు రంగులోకి మారుతున్నాయి. ఈ పొగ, ధూళి ప్రజారోగ్యంపై ప్రభావం చూపకముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సమీక్ష నిర్వహించి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, సాగుకు అనువుగా లేని ప్రాంతానికి కంపెనీలను తరలించేలా చూడాలని కోరుతున్నారు.