
సబ్ కలెక్టర్ బంగ్లాలో అగ్ని ప్రమాదం
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో గల సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బంగ్లా (నివాసం)లో శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. గదిలో ఉన్న ఫర్నిచర్ దగ్ధమైంది. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ నివాసం వద్దకు చేరుకోగా అప్పటికే పొగతో గది నిండిపోయింది. సబ్ కలెక్టర్ వ్యక్తిగత గది కార్యాలయంలో ఎయిర్ కండిషన్, కంప్యూటర్ సామగ్రితో పాటు టేబుల్, కుర్చీలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సబ్ కలెక్టర్ నివాసానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ తెలిపారు.