కారు ఢీకొని వ్యక్తి మృతి
దెందులూరు: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీపర్రుకు చెందిన ఘంటసాల రంగరాజు (55), ఇందుకూరి సుబ్బారావులు రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కై కలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కై కలూరు మండలం భుజబలపట్నంకు చెందిన వేగేశ్న సుఽధీర్‌రాజుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.


