
కార్మిక లోకం.. మీకు సలాం
రక్తాన్ని చెమటగా మార్చి ఎండనక... వాననక కష్టపడి తమ కుటుంబాలను పోషించడానికి రోజువారీ వేతనాల కోసం పనిచేస్తూ శ్రమిస్తున్న కార్మికులు ఎంతో మంది ఉన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నా.. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పటికీ మిఽథ్యగానే కనిపిస్తోంది. కార్మికుల వేతనాల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవి ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ కార్మిక దినాన్ని అధికారికంగా, సంఘాలపరంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నా వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితిలో కూలి పనులే దిక్కుగా నిత్యం శ్రమిస్తున్న కార్మికులకు మేడే సందర్భంగా ‘సాక్షి’ సలాం..
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు

కార్మిక లోకం.. మీకు సలాం

కార్మిక లోకం.. మీకు సలాం

కార్మిక లోకం.. మీకు సలాం

కార్మిక లోకం.. మీకు సలాం