కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు | Sakshi
Sakshi News home page

కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు

Published Sun, May 5 2024 1:50 AM

కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు

పెనుగొండ: దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచి, వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారంతా తగిన బుద్ధి చెబుతారని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రే టెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు, వైఎస్సార్‌ సీపీ ఎలక్షన్‌ కో–ఆర్డినేటర్‌ గెరా హనోక్‌ హెచ్చరించారు. ఆచంటలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత మార్పిడిలు చేసుకోవచ్చు, పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్లవచ్చని రాజ్యాంగంలోని 25, 28వ అధికరణాలు పేర్కొంటున్నాయని హనోక్‌ గుర్తు చేశారు. అందుకు భిన్నంగా కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. దళిత క్రైస్తవులంటే ఎందుకంత చులకన భావమన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. వలంటీర్‌ వ్యవస్థను తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలన్నారు. దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచే పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రకటించారు. సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ట్రెజరర్‌ బి.ఆశీర్వాదం, ఏఐసీసీ పశ్చిమగోదావరి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే డేవిడ్‌రాజ్‌ , జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఎన్‌.క్రీస్తు దాసు, స్టేట్‌ అడ్వైజర్‌ బ్రదర్‌ జె.రాబిన్‌ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement