వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ : ఎంపీ కావ్య | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ : ఎంపీ కావ్య

May 29 2025 1:01 AM | Updated on May 29 2025 1:01 AM

వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌  వెల్‌నెస్‌ సెంటర్‌ : ఎంపీ కావ్

వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ : ఎంపీ కావ్

హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభమవుతున్నట్లు వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్‌నెస్‌ సెంటర్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్‌ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిట్‌లో ‘టెమ్‌ ఎక్స్‌పో’

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లోని సీఆర్‌ఐఎఫ్‌ (సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్‌ (ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్పోపీ) స్పెసిమెన్‌ ప్రిపరేషన్‌ పరికరాల ఎక్స్‌పోను నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement