వరంగల్: చందా కాంతయ్య స్మారక కళాశాల మట్టిలోనే త్యాగం ఉందని కేయూ వీసీ తాటికొండ రమేష్, ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ అన్నారు. దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో బుధవారం జరిగిన ‘చైతన్య ఉత్సవం’(కాలేజ్ డే) కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ మట్టి నుంచి జయశంకర్ సార్... వరవరరావు లాంటి వ్యక్తులు వచ్చారన్నారు. చందా విజయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డిలు సందేశం అందజేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు చందా శ్రీకాంత్, ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ పి.సతీష్‌కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, లైబ్రేరియన్ అనిల్‌కుమార్, కల్చరల్ కోఆర్డినేటర్ అరుణ, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.