
మహిళలచే ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
● నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట: పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో మహిళలదే ప్రధాన భూమిక అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట నర్సంపేట మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణ పారిశుద్ధ్యంపై తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పట్ట ణాభివృద్ధిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య ప ట్టణంగా నర్సంపేట రాష్ట్ర, జాతీయ స్థాయిలో గు ర్తింపు పొందే విధంగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుంటి రజనికిషన్,కమిషనర్ వెంకటస్వామి, కౌన్సి లర్లు,పట్టణ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.