పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణ
వనపర్తి రూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలం కంభాళాపురం, శ్రీరంగాపురం గ్రామపంచాయతీ కార్యాలయాల్లోని క్లస్టర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బయట ప్రదర్శించిన ఓటరు జాబితాను పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు అన్ని సమర్పిస్తున్నారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాల నివేదికను సకాలంలో జిల్లాకేంద్రానికి పంపించాలన్నారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ప్రతిపాదించే వారిలో ఒకరు లేదా ఇద్దరిని వదలాలని, ఎక్కువ మందిని అనుమతించవచ్చని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.


