
అన్నదానం, తాగునీటి వసతి
సలేశ్వరం వచ్చే భక్తుల కోసం మోకాళ్ల కుర్వు, అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల వద్ద స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాలు, చలివేంద్రాలు భక్తులను ఆదుకుంటున్నాయి. అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్ చెక్‌పోస్టు, పుల్లాయిపల్లి బేస్ క్యాంపు, రాంపూర్‌పెంట, మోకాళ్లకుర్వు (సలేశ్వరం), లింగాల మండలం అప్పాయిపల్లి, గిరిజన గుండాల వద్ద వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలతోపాటు 20 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. మూడురోజులపాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డీఈ హేమలత తెలిపారు.