
మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు..
గోపాల్‌పేట 9
రేవల్లి
4
వనపర్తి: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో గ్రామ రాజకీయాల్లో సందడి నెలకొంది. మరోవైపు అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. పంచాయతీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వెనువెంటనే నిర్వహిస్తారనే చర్చకు ఊతమిచ్చేలా జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఖరారు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇదివరకు 14 మండలాలతో ఉన్న జిల్లాలో.. కొత్తగా ఏదుల మండలం ఏర్పాటు కావడంతో వాటి సంఖ్య 15కు చేరింది. గత ప్రాదేశిక ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 128 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఏర్పడిన ఏదుల మండలంలో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ఆరు గ్రామపంచాయతీలను విలీనం కావడంతో అదనంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు. వీటిపై మూడు రోజుల్లోగా అభ్యంతరాలను తెలియజేయాలని గతనెల 30వ తేదీన జిల్లా పరిషత్ అధికారులు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ స్థానాలు అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 132కు చేరింది.