
రోడ్డుపై గజరాజుల హల్‌చల్
మడ్డువలస వంతెన రోడ్డుపై వెళ్తున్న ఏనుగుల గుంపు
వంగర: మడ్డువలస వంతెన సమీపంలో రోడ్డుపై ఏనుగుల గుంపు గురువారం ఉదయం హల్‌చల్ చేశాయి. రోడ్డుపై ఏనుగులు సంచరించడంతో వాహనచోదకులు, రైతులు భయంతో పరుగులు తీశారు. అటవీ సిబ్బంది, ట్రాకర్స్ ఏనుగులను పంటపొలాలు వైపు దారిమళ్లించారు. చెరకు, మొక్కజొన్న, పామాయిల్ పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడతున్నారు. ఏనుగుల తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆందోళనలో జనం
సంగాం పొలాల్లో సంచారం