
ఏపీఈసెట్‌లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. పలువురు విద్యార్థులు మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు. విజయనగరం పట్టణానికి చెందిన వై.పద్మాకర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెటలడ్జికల్ గ్రూప్‌లో కొత్తవలస గొల్లలపాలెంకు చెందిన నంబూర్ అభిషేక్ ఫస్ట్ ర్యాంక్, లక్కవరపుకోట మండలం వీరభద్రపేటకు చెందిన యేడువాక తరుణ్‌కుమార్ 6వ ర్యాంక్ సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన తుమ్మలపల్లి అమూల్య 8వ ర్యాంక్ సాధించారు.

ఏపీఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీఈసెట్‌లో ర్యాంకుల పంట