
రక్తదానం ప్రాణదానంతో సమానం
బొబ్బిలి రూరల్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసే వారే నిజమైన హీరోలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, రెడ్‌క్రాస్, కారుణ్యఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వ హించారు. ఈసందర్భంగా కళాశాల విద్యార్థులు పలువురు రక్తదానం చేశారు. వారిని నిర్వాహకులు అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ జిల్లా చైర్మన్ జేసీ రాజు,ఎకై ్సజ్ సీఐ చిన్నంనాయుడు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.