
ఖరీఫ్ సాగు లక్ష్యం.. 1.16 లక్షల హెక్టార్లు
విత్తన కేటాయింపు ఇలా..
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి దుక్కులు ఆరంభమయ్యాయి. ఖరీఫ్ సాగుకు మెట్ట, పల్లం భూములను రైతులు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.16 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, దుక్కులు చేసేందుకు చేతిలో డబ్బులు లేక రైతులు సతమతమవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు.
జిల్లాలో నువ్వు, వేరుశనగ పంటల సాగు ప్రారంభమైంది. అదును చూసుకుని మెట్ట భూముల్లో వేరుశనగ విత్తనాలు విత్తుతున్నారు. నువ్వు పంటను మెట్ట, పల్లపు భూముల్లో సాగు చేస్తున్నారు. గంట్యాడ, బొండపల్లి, విజయనగరం, డెంకాడ, గజపతినగరం, దత్తిరాజేరు, చీపురుపల్లి, మెరకముడిదాం, రామభద్రపురం, మెంటాడ, గరివిడి, గుర్ల తదితర మండలాల రైతులు నువ్వు, వేరుశనగ పంటల సాగులో బిజీ అయ్యారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ అధికారులు 50,020 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో ఎంటీయూ –1121 రకం 38,000 క్వింటాళ్లు, సాంబమసూరి రకం 2,500 క్వింటాళ్లు, 1064 రకం 2,200 క్వింటాళ్లు, సోనామసూరి 2,500 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం 1650 క్వింటాళ్లు, స్వర్ణ రకం 2000 క్వింటాళ్లు, ఎంటీయూ1318 రకం 800 క్వింటాళ్లు, ఆర్‌జీఎల్ 2537 రకం 200 క్వింటాళ్లు, ఎంటీయూ 1061 రకం 60 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం 50 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్ 3449 రకం 60 క్వింటాళ్లు కేటాయించారు.
నువ్వు, వేరుశనగ పంటల సాగు ప్రారంభం
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఇలా..
వరి సాధారణ సాగు విస్తీర్ణం
91,214 హెక్టార్లు
మొక్కజొన్న 12,386,
చెరకు 4,720 హెక్టార్లు
50,020 క్వింటాళ్ల వరి విత్తనాల కేటాయింపు
ప్రారంభమైన తొలకరి దుక్కులు
‘అన్నదాత సుఖీభవ’ కోసం ఎదురుచూపు
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,16,993 హెక్టార్లగా వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, చోడి, పత్తి, వేరుశనగ, గోగు, మిరుప, చెరకు తదితర పంటలను రైతులు సాగుచేస్తారని చెబుతున్నారు. వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 91,214 హెక్టార్లగా పేర్కొన్నారు. ఆ మేరకు విత్తనాలు, ఎరువులకు ప్రతిపా దనలు పంపించి సిద్ధం చేస్తున్నారు.