
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సా ర్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రుషికొండలోని ఏ1–గ్రాండ్ హోటల్‌లో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర, నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, కూటమి పాలనలో ఏడాదిలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, హాజరుకావాలని కేకే రాజు పిలుపునిచ్చారు.