
దుండగులను అరెస్ట్ చేయాలి
పరిగి: పుట్టపహాడ్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. దుండగులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తున్నారన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోవింద్‌నాయక్, వెంకట్, సత్తయ్య పాల్గొన్నారు.
లేదంటే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్