
అంగన్‌వాడీ టీచర్‌పై విచారణ
దోమ: కోడిగుడ్ల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్‌పై సీడీపీఓ మెహర్‌ఉన్నీసా బేగం విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని బట్ల చందారం గ్రామంలో కావలి మంగమ్మ(గర్భిణీ)కి అంగన్‌వాడీ టీచర్ ఆనంద గుడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె పేరు నమోదు కాకపోవడంతో హైదరాబాద్ నగరంలో ఉంటూ మే 20న వచ్చి కేంద్రంలో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 20న అంగన్‌వాడీ కేంద్రానికి గుడ్లకు రాగా.. టీచర్‌తో మంగమ్మ భర్త సురేశ్ ఫోన్‌లో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో టీచర్ ఆనంద, ఆమె భర్త వీరప్పతో కలిసి సురేశ్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ మేరకు ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా, గత నెల 21న ఆనంద, వీరప్పలపై కేసు నమోదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీపీఓ, డీడబ్ల్యూఓకు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ మేరకు మంగళవారం సీడీపీఓ గ్రామానికి వచ్చి గ్రామ మాజీ సర్పంచ్‌తో పాటు గ్రామస్తులతో కలిసి విచారణ చేపట్టారు.