
చికిత్స పొందుతున్న మహిళ మృతి
దుద్యాల్: తమ కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టిన ఘటనలో మరొకరు మృతి చెందారు. వివరాలు.. ఈ నెల 25న కోస్గికి చెందిన వెంకటేశ్, అనిత దంపతులు తమ మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి కొడంగల్ వెళ్తుండగా.. దుద్యాల్ గేట్ వద్ద ఓ లారీ అదుపుతప్పి వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా దంపతులను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనిత పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందింది. వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కోస్గిలో అనిత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు సోమవారం కొడంగల్ ఠాణాకు తరలించారు.