ఆటో సీజ్, ఒకరి అరెస్టు
ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.
ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్‌లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ పాల్గొన్నారు.

18 లీటర్ల సారా పట్టివేత