
శిథిలావస్థకు చెరువు తూము
దుద్యాల్: మండలంలోని ఆలేడ్ గ్రామంలో ఉన్న తూము లీకేజీ కావడంతో చెరువులో ఉన్న నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పూర్తిస్థాయి నీటి మట్టం నిండుకుంది. చెరువు తూము లీకేజీ కావడంతో నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. తూము నుంచి నీరు బయటకు పోకుండా ఉపయోగించే ఇనుప రాడ్డు పూర్తిగా లోపలికి పడిపోయిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. చెరువు తూము లీకేజీ అవుతున్నా ఇప్పటివరకు ఏ అధికారి కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి తూముకు మరమ్మతులు చేయాలని వ్యవసాయదారులు కోరుతున్నారు.
యువత వ్యసనాల
బారిన పడొద్దు
గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు
యాచారం: యువత చెడు అలవాట్లకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు సూచించారు. పీఎస్ పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు నిబంధనలు, ఘర్షణల వల్ల జీవితాల నాశనం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతనేనని, అలాంటి వారు వ్యసనాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గొప్ప లక్ష్యంతో యువత ఆసక్తి కలిగిన రంగాల్లో రాణించాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదుతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, బంగారు నగలను ఇంట్లో ఉంచి వెళ్లరాదని సూచించారు. సమావేశంలో రాచకొండ సీఐ జోసఫ్, ఎస్‌ఐ తేజంరెడ్డి పాల్గొన్నారు.
అర్ధరాత్రి విహరిస్తే
కఠిన చర్యలు
మీర్‌పేట సీఐ నాగరాజు
మీర్‌పేట: వేడుకలు, ఇతర కారణాలతో అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీర్‌పేట పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు యువతను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి తరువాత స్టేషన్ పరిధి నందనవనం, ఆర్‌ఎన్‌రెడ్డినగర్, భూపేష్‌గుప్తానగర్‌లలో పోలీసులు ఆపరేషన్ చబుత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న 122 మంది యువకులను గుర్తించారు. జన్మదిన వేడుకల పేరుతో కాలనీ కూడళ్లు, ప్రధాన రహదారులపైకి రావడం, అదే విధంగా రాత్రంతా బాక్స్ టైపు క్రికెట్ ఆడుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఇన్‌స్పెక్టర్ సూచించారు. ఏ కారణం లేకున్నా యువత రోడ్లపై ద్విచక్ర వాహనాలను విచ్చలవిడిగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు గొడవలకు కారణమవుతాయని అవగాహన కల్పించారు. ఆపరేషన్ చబుత్రలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గౌరునాయుడు, ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
12న ఐటీ ఉద్యోగులకు
అవగాహన
రాయదుర్గం: ఐటీ ఉద్యోగుల కోసం గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌లో జూలై 12వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాంతిసరోవర్ క్యాంపస్‌లోని ఇన్నర్‌స్పేస్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ సందర్భంగా ‘ఇన్నర్ ఎక్స్‌లెన్స్ రీట్రీట్’ పేరిట ‘ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనస్సును పున:ప్రారంభించడం’పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

శిథిలావస్థకు చెరువు తూము