
కొడంగల్‌లో ఆర్‌పీఎఫ్ బలగాల కవాతు
కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల్లో ఆర్‌పీఎఫ్ బలగాలు శనివారం కవాతు నిర్వహించాయి. 99 బెటాలియన్ హకీంపేటకు చెందిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు జవానులు కొడంగల్ పుర వీధుల గుండా తిరిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ప్రజల్లో భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్డు మీదుగా వినాయక చౌరస్తా, సంత బజార్, బ్రాహ్మనవాడ, తెలుగుగేరి, బాలాజీనగర్ మీదుగా కవాతు సాగింది.
ప్రజలతో మమేకం కండి
ఎస్పీ నారాయణరెడ్డి
అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేస్తే మంచి పేరు వస్తుందని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తాండూరు పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేసి ఉద్యోగ విమరణ పొందుతున్న మైపాల్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు పోలీసు ఉద్యోగం చేయడమంటే చాలా గొప్ప విషయమన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారిగా మైపాల్‌రెడ్డి మంచిపేరు తెచ్చుకున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో ప్రజలకు మనం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, జిల్లా పోలీసు ప్రెసిడెంట్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హారికకు ప్రావీణ్య
పురస్కార్ అవార్డు
కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చి నెలలో జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో హారిక రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్‌రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి హారికకు అవార్డు, మెమొంటో, మెడల్ అందజేశారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్‌ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానం చేశారు.
యాదవులపై
దాడులను ఆపాలి
బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్
మోమిన్‌పేట: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో యాదవులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం జాతీయ కార్యదర్శి బీరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్య క్రమంలో నాయకులు మల్లయ్య, యాదగిరి యదవ్, మానయ్య, అంజయ్య, బిచ్చయ్య, అంజి, పాపయ్య, శ్రీను పాల్గొన్నారు.

కొడంగల్‌లో ఆర్‌పీఎఫ్ బలగాల కవాతు

కొడంగల్‌లో ఆర్‌పీఎఫ్ బలగాల కవాతు

కొడంగల్‌లో ఆర్‌పీఎఫ్ బలగాల కవాతు