
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానా లు గెలిచి సత్తా చాటాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులకు సూచించారు. శనివారం మండలంలోని మన్నేగూ డలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కలసికట్టుగా పని చేసి పార్టీ నాయకులను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. మండల కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పదవులను వారంలోగా భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, పెంటయ్య, అజీం పటేల్, శ్రీనివాస్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో అన్ని కమిటీలు వేస్తాం
కుల్కచర్ల: త్వరలో అర్హులైన వారికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అందుతాయని, ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో గ్రామ, మండల కమిటీ, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పార్టీకోసం కష్టపడే వారికి చోటు లభిస్తుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు నరేందర్, వినోద్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పాంబండ ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్‌కుమార్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నర్సింలు యాదవ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు జంగయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్, మాజీ ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి