
‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక
అనంతగిరి: షెడ్యూల్ కులాల, గిరిజన సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు డ్రా పద్ధ తిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీశారు. గిరిజన సంక్షేమ శాఖలో 3, 5, 8వ తరగతులకు 22 మందిని తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. షెడ్యూల్ కులాల విభాగంలో ఒకటవ తరగతిలో 88 ఖాళీలకు గాను 139 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గ్రూపుల వారీగా సీట్ల కేటాయింపు జరిగిందని వివరించారు. గ్రూప్ వన్‌లో 6 సీట్ల గాను ఇద్దరు, గ్రూప్ 2లో 53 సీట్లకు గాను 87 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. గ్రూప్ 3లో 29 సీట్లకు గాను 50 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఒకటవ తరగతిలో 88 సీట్లకు గాను 84 మంది విద్యార్థులు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. 5వ తరగతిలో 91 సీట్లకు గాను 17 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారందరినీ ఎంపిక చేయడం జరిగిందన్నారు. డ్రా పద్ధతిలో ఎంపికై న విద్యార్థులకు జూలై 3న పత్రాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి, సహాయ సంక్షేమ అధికారులు శుక్రవర్ధన్ రెడ్డి, వీరానందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.