
రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్
బంట్వారం: ప్రస్తుతం మూడు నెలల బియ్యం పంపిణీ ఒకే సారి ఇస్తున్నందున గడువును మరో 15రోజుల పాటు పొడిగించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తెల్లి లక్ష్మణ్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. పౌరసరఫరాల శాఖ విధించిన గడు వు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుందని ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకోలేకపోయారని అన్నారు. మూడు నెలల రేషన్ కోటా ఒకే సారి ఇస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వాలంటే 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందన్నారు. త్వరగా వేలిముద్రలు రాకపోవడం, ఇతర కారణాలతో అర్హులందరూ రేషన్ తీసుకోలేకపోయారని ఆయన తెలిపారు. మరింత గడువు పెంచాలని డిమాండ్ చేశారు.. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.