
గంజాయి పట్టివేత
కొడంగల్: ఇద్దరు వ్యక్తుల నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన కొడంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాండూరుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, నిఖిల్ బీదర్‌లోని ఇరానీగల్లిలో అరకిలో గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని తీసుకొని బుల్లెడ్ బండిపై కొడంగల్‌లో విక్రయించడానికి వస్తుండగా పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం వారిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.