
సాగు అగమ్యగోచరం
మోమిన్‌పేట: వరుణుడి జాడ లేకపోవడంతో వానాకాలం సాగు అగమ్యగోచరంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మృగశిర కార్తెలో కురిసిన చిన్నపాటి వర్షాలకు కొంతమంది పత్తి విత్తనాలు నాటారు. ఆతర్వాత పదిహేను రోజులు గడిచినా వాన లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. సరైన తేమ లేకపోవడంతో 50నుంచి 60 శాతం మాత్రమే మొలకలు వచ్చాయని, ప్రస్తుతం ఇవి కూడా ఎండిపోతున్నాయని దిగులు చెందుతున్నారు. ఆకాశంలోని మేఘాలు నిత్యం ఊరిస్తున్నాయే తప్ప చినుకు కురవడం లేదని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంటున్నా ఫలితం కనిపించడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదని, మళ్లీ విత్తనాలు వేయాలంటే రెండింతల పెట్టుబడి అవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పత్తాలేని వరుణుడు
ఎండుతున్న మొలకలు