
ఒకే భవనం.. రెండు కార్యాలయాలు
గదిలో అంగన్‌వాడీ.. వరండాలో గ్రామ పంచాయతీ
మండల పరిధిలోని సత్తర్‌కుంట తండాలో ఒకే గదిలో రెండు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తండాలను పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసిన సమయంలో తండాలో ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రంలో తాత్కాలికంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఉన్న ఒక్క భవనంలో సగభాగం అంగన్‌వాడీ కేంద్రం, మరో సగంలో పంచాయతీకి సంబంధించిన సామగ్రిని ఏర్పాటు చేశారు. దీంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీకి సొంత భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని తండావాసులు కోరుతున్నారు. – దుద్యాల్