
జీపీ కార్మికుల ఆందోళన మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
8లోu
వికారాబాద్: హస్తం పార్టీలో అసంతుష్ట నేతలు పెరిగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు ఆశిస్తూ వస్తున్న పలువులు ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిన్నర దాటినా వారి ఆకాంక్ష తీరకపోవడంతో నిరాలో ఉన్నారు. ఈ జాబితా రోజురోజుకూ పెరిగిపోవడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. పదవులను ఆశించే వారిలో కేడర్ నుంచి లీడర్ వరకు ఉన్నారు. జిల్లాలో ఇది ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాకుండా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అదే పరిస్థితి కనిపిస్తోంది. పదవుల పందెరంలో చోటు దక్కకపోవడంతో నేతల నిరీక్షణ కాస్త పార్టీలో లుకలుకలకు దారితీస్తోంది. ప్రస్తుతం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి నేతలు గళం విప్పుతున్నారు. ఇది పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. ఆశావహుల్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎవరికి వారు.. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పెద్ద నాయులు దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో పాపులు కదుపుతుండగా గల్లి నేతలు రాష్ట్ర రాజధాని గాంధీ భవన్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు.
పెద్ద నేతలు సైతం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నేతకే సీఎం పదవి దక్కింది. సీఎం పదవి తోపాటు శాసన సభ స్పీకర్ పీఠం కూడా జిల్లాకు చెందిన గడ్డం ప్రసాధ్‌కుమార్‌కే దక్కింది. అయితే జిల్లాకు చెందిన పెద్ద నాయకులు ఇంకా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి రాష్ట్రస్థాయి పోస్టు దక్కగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సీఎం నియోజకవర్గంలో ఈ రెండు పదవులు మినహా జిల్లా నేతలకు ఇంకే ఇతర పెద్ద పదవులు దక్కలేదు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత క్యాబినెట్‌లో కూడా ఆయన పోర్టుపోలియోను ఆశించారు. సామాజిక వర్గాల ప్రాతిపదికగా జరిగిన ఈక్వేషన్‌లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కుదరలేదు. దీంతో స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్యాబినెట్ హోదాతో పోలిస్తే ప్రోటోకాల్ పెద్దదే అయినా ఆయన మంత్రి పదవికే మొగ్గు చూపారు. ఇటీవలి జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇక జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అయిన టీ రామ్మోహన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014 మరియు 2018తో పాటు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రెండు సార్లు గెలుపొందిన వారందరు ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నారు. ఒక్క నాకు మాత్రమే ఆ అవకాశం దక్కలేదని ఆయన పేర్కొంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల ముందు నుంచే ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా పార్టీని వీడకుండా నమ్మకంగా ఉన్న నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన ఇదే విషయం అధిష్టనం ముందుంచారు. మరో నాయకుడు రఘువీరారెడ్డి సైతం నామినేటెడ్ పదవుల్లో సముచత స్థానం కల్పించాలని కోరుతూ వస్తున్నారు. ధారూరు మండలంలో తాజాగా జరిగిన క్షేత్రస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయనకు పదవి ఇవ్వాలని పలువురు నాయకులు నిరసన తెలిపారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. రోడ్డుపై ధర్నా చేసే దాకా ఈ వ్యవహారం నడిచింది.
పెరుగుతున్న ఆశావహులు
జిల్లాలో ఆశావహులు, అసంతుష్టులు పెరిగిపోతున్నారు. మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తప్ప జిల్లా నేతలకు పెద్దగా నామినేటెడ్ పదవులు దక్కలేదు. పరిగి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు హన్మంతు ముదిరాజ్, లాల్ కృష్ణప్రసాద్, అశ్రఫ్, చంద్రయ్య, శ్రీనివాస్ తదితరులు పదవులు ఆశిస్తూ వస్తున్నారు. తాండూరులో బుయ్యని శ్రీనివాస్‌రెడ్డికే ముందుగా కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరగ్గా చివరి నిమిషంలో మనోహర్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. దీంతో మంచి స్థానం కల్పిస్తామని శ్రీనివాస్‌రెడ్డిని అప్పట్లో సముదాయించారు. ఆయనకు కూడా ఇప్పటి వరకు ఏ పదవి దక్కలేదు. ఇతర సీనియర్ నాయకులు పురుషోత్తంరావ్, అబ్దుల్ రహూఫ్, విజయాదేవి, నర్సింహులు, స్వప్నపరిమళ్ కూడా పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వికారాబాద్‌లో సుధాకర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, రాంచంద్రారెడ్డి, కిషన్‌నాయక్, నరోత్తంరెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన నందారం ప్రశాంత్, మహ్మద్ యూసుఫ్, ముద్దప్ప తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు.
న్యూస్‌రీల్

జీపీ కార్మికుల ఆందోళన మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద

జీపీ కార్మికుల ఆందోళన మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద

జీపీ కార్మికుల ఆందోళన మూడు నెలలుగా వేతనాలు అందక పారిశుద