
ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందాలి
పరిగి: మండలంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సూచించారు. శుక్రవారం జాపర్‌పల్లిలోని మిషన్ భగీరథ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. అనంతరం పూడూరు మండలంలో మీర్జాపూర్ రోడ్డు పనులను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణపై ఆరా తీశారు. ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలపై సత్వరం స్పందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ కోరగా ప్రిన్సిపల్ సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ఆర్‌డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్