
రాసుకొని వెళ్లిపోతారని అనుకోకండి
తాండూరు రూరల్: ఉపాధి హామీ పథకం పనుల వివరాలు తెలుసుకునేందుకు వచ్చే అధికారులు కేవలం రాసుకొని వెళ్లిపోతారు అనుకుంటే పొరపాటని అక్రమాలు తేలితే కఠిన చర్యలు తప్పవని డీఆర్‌డీఏ ఏపీడీ సరళ హెచ్చరించారు. శుక్రవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 2024 జనవరి నుంచి 2025 మార్చి వరకు రూ.6.42 కోట్ల విలువ చేసే పనులు చేపట్టారు. వీటిపై 16 బృందాలతో 33 గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.3 లక్షల 5 వేల 733 రికవరీకి చేశామని తెలిపారు. అదేవిధంగా రూ.24 వేలు ఫైన్ వేసినట్లు వివరించారు. బినామీ పేర్లతో పనులు చేసినట్లు గుర్తించామన్నారు. రికార్డు నమోదు కూడా సక్రమంగా చేయలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, అంబుడ్స్‌మెన్ రాములు, విజిలెన్స్ ఆఫీసర్ భార్గవి, ఏపీఓ నరోత్తంరెడ్డి, ఆపరేటర్ అమృత, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
అక్రమాలు తేలితే కఠిన చర్యలు
డీఆర్‌డీఏ ఏపీడీ సరళ
తాండూరులో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక