
సామగ్రి కొనుగోలులో చేతివాటం
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పరిరక్షణ సామగ్రి కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందని మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం సమాచార హక్కు చట్టం కింద వివరాలను ఇవ్వాలంటూ మున్సిపల్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులకు సామగ్రి కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో రూ.40 లక్షల నిధులను వెచ్చించాలని గత కౌన్సిల్‌లో చర్చ జరిగినప్పుడు, వారికి ఖర్చు చేసే నిధులపై అభ్యంతరం తెలిపామన్నారు. అలాంటిది ఇట్టి నిధులకు మరో రూ.10లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షలతో సామగ్రి కొనడం విడ్డూరమన్నారు. మహిళా కార్మికుల కోసం రూ.1800 పెట్టి ఒక్కో చీర కొనుగోలు చేశామని చెప్పడంలోనే అసలు స్కాం బయట పడిందన్నారు. అంతేకాకుండా ఇతర సామగ్రి కొనుగోలులో కూడా స్కాం జరిగినట్లు తెలుస్తోందన్నారు. కావున జరిగిన అవినీతిని బయట పెట్టేందుకే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు దాఖలు చేశానని ఆమె తెలిపారు.
ఆర్టీఐ దరఖాస్తును చూపుతున్న మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్
మాజీ కౌన్సిలర్ సంగీత ఆరోపణ
వివరాలు ఇవ్వాలంటూ స.హ. చట్టం కింద దరఖాస్తు