
హోటళ్లలో తనిఖీలు
తాండూరు టౌన్: పట్టణంలోని పలు హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది గురువారం తనిఖీలు నిర్వహించారు. దర్బార్, అల్ఫూర్‌ఖాన్, న్యూ సన్మాన్, రాయల్ ఫుడ్, సోహైల్ హోటళ్లతో పాటు పలు పాస్ట్ ఫుడ్ సెంటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్, ఫ్రిడ్జ్ శుభ్రత నిర్వహణ, తాగునీరు, వంటలకు ఉపయోగిస్తున్న పదార్థాలను తనిఖీ చేశారు. పాడైపోయిన నూడుల్స్, నిల్వ చేసిన సాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుభ్రత పాటించని పాత కూరగాయల మార్కెట్‌లోని ఓ హోటల్‌ను సీజ్ చేశారు. ఈసందర్భంగా శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఉమేష్ మాట్లాడుతూ.. వర్షాకాలం, వ్యాధుల సీజన్ కావడంతో పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించా రు. కుళ్లిన పదార్థాలను నిల్వ చేసి వినియోగిస్తే చర్యలు తప్పవన్నారు. పలు హోటళ్ల నుంచి నిల్వ ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఈ తనిఖీల్లో మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు.
పాస్ట్ ఫుడ్ సెంటర్లలో శుభ్రత పరిశీలన
కుళ్లిన, నిల్వ చేసిన పదార్థాలు వాడొద్దని హెచ్చరిక
ఓ హోటల్‌ను సీజ్ చేసిన
మున్సిపల్ అధికారులు