
నిజం తేల్చకుండానే సస్పెన్షన్ ఏమిటి?
యాలాల: నిజ నిర్ధారణ చేయకుండానే ఏకపక్షంగా టీచర్‌ను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఎంఈఓ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్, సీఐటీయూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి, పీడీఎస్‌యూ, ఉద్యమకారుల ఐక్యవేదిక, పబ్లిక్ వాయిస్, పూలే అంబేడ్కర్ తదితర సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాఠ్య బోధనలో భాగంగా సైన్స్ టీచరు ఖాసీం బీ గొర్రె మెదడును పదర్శించారన్నారు. ఈ విషయంలో మరో జంతువు మెదడు తెచ్చారంటూ ఆందోళన చేయడం సరికాదని తెలిపారు. ఈ విషయంలో నిజనిర్ధారణ చేయకుండా ఓ మైనార్టీ టీచర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అబ్దుల్ వాహాబ్, ఉప్పలి మల్కయ్య, శ్రీనివాస్, చంద్రప్ప, గుమ్మడి రత్నం, సమియొద్దీన్, శ్రీనివాస్, వాజిద్, జిలానీ, రఘుపతి, అహ్మద్, అక్బర్‌బాబా, ముస్తఫా, రియాజ్ తదితరులు ఉన్నారు.
ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
విద్యాశాఖ అధికారులకు ప్రజాసంఘాల వినతి