
కన్నబిడ్డల్లా చూసుకోవాలి
తాండూరు రూరల్: తల్లిదండ్రులను వదలి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులను ఉపాధ్యాయులు కన్నబిడ్డల్లా చూసుకోవాలని ట్రెయినీ కలెక్టర్ హర్షిత్ చౌదరి అన్నారు. గురువారం మండలంలోని ఐనెల్లి శివారులో గల కేజీబీవీని తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంట గదిని పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, స్పెషల్ ఆఫీసర్ ఆశలత, ఆర్‌ఐ గోపి తదితరులు పాల్గొన్నారు.
ట్రెయినీ కలెక్టర్ హర్షిత్ చౌదరి