
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి కాంస్యపతకం
కొడంగల్ రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న అల్వాల్ సాయికిరణ్‌కు షాట్‌పుట్ విభాగంలో కాంస్య పతకం వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన 23వ జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ విభాగంలో విద్యార్థి సాయికిరణ్ కాంస్య పతకం సాధించ డం హర్షణీయమన్నారు. తమ కళాశాల విద్యార్థి జాతీయ స్థాయిలో పతకం సాధించడం గర్వ కారణమన్నారు. క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసం, శారీరక దృడత్వం, సామాజిక గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.
బావిలో పడి వృద్ధుడు మృతి
పరిగి: పొలానికి వెళ్లిన వృద్ధుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ ఈదయ్య(70)కు కొంత కాలం క్రితం కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్ల దగ్గర ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం పొలం దగ్గర స్నానం చేసివస్తానని చెప్పి వెళ్లాడు. దీంతో మనవళ్లు బైక్‌పై ఎక్కించుకుని పొలం దగ్గర దించి వచ్చారు. మళ్లీ టిఫిన్ తీసుకుని వెళ్లి అక్కడ పెట్టి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలం దగ్గర చూడగా ఈదయ్య కనిపించ లేదు. దీంతో అక్కడ చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించ లేదు. బావి దగ్గరకు వెళ్లి చూడగా గట్టుపైన చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారొచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. బుధవారం మృతుడి కోడలు వెంకటమ్మ మామ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా శరణు బసప్ప నియామకం
జులై 6న ప్రమాణ స్వీకారం
తాండూరు టౌన్: తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్ శరణు బసప్పను నియమించారు. ఆయనతో పాటు క్లబ్ కార్యదర్శిగా మంకాల్ నటరాజ్, కోశాధికారిగా గౌరీ శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేస్తుందన్నారు. వచ్చే నెల 6వ తేదీన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన లయన్స్ క్లబ్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీల హక్కులపై
చర్చించండి
షాద్‌నగర్‌రూరల్: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం, బీసీసేన గ్రామ కమిటీలు, కార్యాచరణపై చర్చించారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్.కృష్ణయ్యను నాయకులు కోరారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీసేన కమిటీలను పటిష్టంగా వేసుకోవాలని, కులాలకతీతంగా భాగస్వాములను చేయాలని కృష్ణయ్య సూచించారు. బీసీలను అన్ని రంగాల్లో చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి కాంస్యపతకం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి కాంస్యపతకం