
ఆర్‌బీఓఎల్ పరిశ్రమ సీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
ఇథనాల్ సరఫరాకు ఒప్పందం
తాండూరు: పెట్రో ధరల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని ఆర్‌బీఓఎల్ పరిశ్రమ సీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం యాలాల మండలం జెక్కెపల్లి గ్రామ శివారులోని పరిశ్రమలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో మూడు కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా చేయాలని పెట్రోలియం సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌లు ఆర్‌బీఓఎల్ పరిశ్రమతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సరఫరా కొనసాగుతోందన్నారు. పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయంలో గ్రీన్ బడ్జెట్ సీఎస్‌ఆర్ నిధులను రెండు నెలలుగా రక్షణ శాఖకు అందిస్తున్నామని వివరించారు.