
‘స్థానిక’ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
బొంరాస్‌పేట: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక ఏడాదిన్నర కావస్తుందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో హాజరైన అనంతరం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా ఎస్పీ స్పందించాలి
రెవెన్యూ అధికారులను, పోలీసులను అదుపులో పెట్టుకొని సొంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు అక్రమ కేసులతో భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐని రెండు రోజుల్లో సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, నాయకులు మహేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చాంద్‌పాషా, మధుయాదవ్, శ్యామలయ్యగౌడ్, గోవింద్‌రెడ్డి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
సాయిచంద్ వర్ధంతికి రావాలి
సాయిచంద్ మౌర్య రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 29న ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తున్నామని ఎరన్‌పల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి గోడపత్రికను విడుదల చేశారు. వర్ధంతి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఇందులో మాసాని వెంకటయ్య, నెహ్రూనాయక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు ఉత్తిదే
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఎస్‌ఐ రవూఫ్‌ను రెండు రోజుల్లో
సస్పెండ్ చేయాలి
లేదంటే ఆందోళన
విలేకర్ల సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి