
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు రవికుమార్‌పై దాడిచేసి గాయపరిచిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్, దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ..హాజీపూర్‌కు చెందిన రవికుమార్ గోరేపల్లి గ్రామానికి చెందిన కోటం శ్రీనివాస్‌కు చెందిన పొలాన్ని ఏడేళ్లుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ నెల 17న పొలంలో విత్తనాలు వేసేందుకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన కోటం విష్ణు, ఫకీరప్ప తమ అనుచరులతో వచ్చి రవిపై కర్రలతో దాడి చేసి చంపేందుకు యత్నించారన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటకి నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మహిపాల్, శ్రీనివాస్, బుస్సా శ్రీనివాస్, వ్య.కా.స. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు