
ప్రైవేట్ స్కూల్‌లో పుస్తకాలు సీజ్
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పుస్తకాల విక్రయ దందా కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న బీసీ జేఏసీ నాయకులు బుధవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని చోట పుస్తకాలు విక్రయిస్తున్న విషయంపై మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ అక్కడికి చేరుకుని సుమారు రూ. 4లక్షల విలువైన పుస్తకాలను సీజ్ చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించొద్దని గతంలోనే సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐనప్పటికీ సదరు స్కూల్ యాజమాన్యం ఓ గదిలో పుస్తకాలు, బ్యాగులు తదితర స్టేషనరీ సామాన్లను విక్రయిస్తోందన్నారు. ఈ మేరకు పుస్తకాలు నిల్వ చేసిన గదిని సీజ్ చేసి, ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం సదరు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ పేర్కొన్నారు.
బీజేపీ నాయకుల ఆందోళనతో
స్పందించిన విద్యాశాఖ అధికారులు