
వ్యసనాలకు దూరంగా ఉండాలి
కుల్కచర్ల: వెనుకబడిన తరగతుల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజలకు పీఎం జన్‌మన్, జాతీయ గౌరవ్ ఉత్సవ్ అభియాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఇప్పించడం, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇళ్లు లేని వారి వివరాలను సేకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముజాహిద్‌పూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్ గోవింద్, పంచాయతీ కార్యదర్శి మైమూనాబేగం తదితరులు పాల్గొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి నషా ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాలాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని పేర్కొన్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోరాదని సూచించారు. కార్యక్రమంలో కుల్కచర్ల వసతి గృహ ప్రత్యేకాధికారి సుందర్, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ రాజేందర్ రాథోడ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
● జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి