అబుదాబి, దుబాయ్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు
తిరుపతి అర్బన్: బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన యువతులకు అబుదాబి, దుబాయ్‌లో హోమ్‌కేర్ నర్స్ ఉద్యోగాలను జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ భాగస్వామ్యుంతో ఇప్పించనున్నామని ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 21–40ఏళ్ల వయస్సులోపు ఉండి, వృత్తిలో రెండేళ్ల అనుభ వం ఉండాలని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9160912690, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: అటానమస్ హోదాలో శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల డిగ్రీ మూడో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ విడుదల చేశారు. నవంబర్ 3వ తేదీ జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అతి త్వరగా విడుదల చేసేందుకు సహకరించి కళాశాల అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో 95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌న్స్ డాక్టర్ ఎ విద్యుల్లత, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరింటెండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ సభ్యులు జి సుధాకర్, చంద్రశేఖర్, సంధ్య పాల్గొన్నారు.
4,5 తేదీల్లో ఎస్వీ వెటర్నరీలో జాతీయ సమావేశం
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజుల పాటు పీజీ, డాక్టరల్, యూజీ చివరి సంవత్సరం విద్యార్థులకు వెటర్నరీలో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పశువుల ఆరోగ్యం, ఉత్పాదనపై ప్రభా వం అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలు, వారి ఆవిష్కరణల ద్వారా పశువుల్లో వ్యాధులు తగ్గించి, పాలు, మాంసం ఉత్పత్తులు పెంచి జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలోని 8 రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొనడంతోపాటు వారి పరిశోధన పత్రాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ సమావేశంలో మొత్తం 6 అంశాలపై చర్చించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ ఫుడ్స్, ఫీడ్ మిల్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్‌రావు, వీసీ జేవీ రమణ, అంకో సీక్ కంపెనీ చైర్మన్ డాక్టర్ శ్రీలత, న్యూజీలాండ్, అస్ట్రేలియాకు చెందిన జీఓటీఎస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొనున్నారన్నారు.
అబుదాబి, దుబాయ్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు


